ED Notices KTR : 16న విచారణకు రావాలి : కేటీఆర్ కు ఈడీ నోటీసులు

ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 16న వ్యక్తిగతంగానే విచారణకు రావాలని నోటీసులలో పేర్కొంది. విదేశీ సంస్థ అయిన ఎఫ్ఎస్ఈవోకు కట్టబెట్టిన రూ.55 కోట్ల వ్యవహారంపై మనీలాంరింగ్ తో పాటు ఫెమానిబంధనల ఉల్లంఘనల వ్యవహారంపై కేటీఆర్ ను ప్రశ్నించనుంది ఈడీ. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఎస్ఐఆర్ ఆధారంగా చేసుకొని ఈసీఐఆర్ ను ఈడీ నమోదు చేసింది. వాస్తవానికి ఈడీ ఎదుట కేటీఆర్ మంగళవారం హాజరు కావాల్సి ఉంది. అయితే, ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఎస్ఐఆర్ రద్దు చేయాలని ED ఇప్పటికే హైకోర్టులో వేసిన కేసులో తీర్పు రిజర్వ్ ఉందని తెలిపారు. హైకోర్టు పైనున్న గౌరవంతో.. తీర్పును వెలువరించేంత వరకు ఈ అంశంలో తనకు సమయం ఇవ్వాలని కోరారు. అయితే ఫార్ములా ఈ-రేసు కేసులో హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. ఈ కేసులో మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనపై ఈనెల 16న విచారణకు రావాలని కేటీఆర్కు నోటీసులు జారీచేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com