TG : భూదాన్ కేసులో మర్రి జనార్ధన్ రెడ్డికి ఈడీ నోటీసులు

TG : భూదాన్ కేసులో మర్రి జనార్ధన్ రెడ్డికి ఈడీ నోటీసులు
X

భూదాన్‌ భూముల కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. వంశీరామ్‌ బిల్డర్స్‌ సుబ్బారెడ్డికి సైతం ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆమోద డెవలపర్స్‌కి చెందిన సూర్యతేజతోపాటు KSR మైన్స్‌కు చెందిన సిద్ధారెడ్డి ఈ స్కామ్‌లో లాభపడినట్లు ఈడీ గుర్తించింది. ఇస్కాన్‌లో ఇప్పటికే ఐఏఎస్‌ అమోయ్‌ కుమార్‌ను ఈడీ పలమార్లు విచారించింది. తాజాగా నలుగురికి నోటీసులు జారీ చేశారు. డిసెంబర్‌ 16న హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది.

Tags

Next Story