ED Raids : పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు.. పీసీసీ ఫైర్

ED Raids : పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు.. పీసీసీ ఫైర్
X

మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. ఇదంతా కక్ష్య పూరిత చర్యల్లో భాగంగానే జరుగుతోందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయకారి ఒప్పందంలో భాగంగా ఇవి జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే తమ నాయకులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయడం మంచిది కాదని హెచ్చరించారు. పదేండ్ల ఈడీ దాడుల్లో 97 శాతం దాడులు ప్రతిపక్ష నాయకులపై జరిగినవే అని రాజకీయంగా లబ్ధి పొందేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మహేశ్‌ కుమార్‌ గౌడ్ దుయ్యబట్టారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు జరిగాయి. లగ్జరీ వాచ్‌ల కుంభకోణం నేపథ్యంలో అధికారులు ఈ సోదాలు చేపట్టారు. ఆయన ఇల్లు, ఫామ్‌హౌజ్‌ తదితర ఐదు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన కుమారుడు హర్ష రెడ్డికి కస్టమ్స్‌ అధికారులు నోటీసులు ఇచ్చారు. సింగపూర్‌ నుంచి చెన్నై పోర్టుకు ఖరీదైన వాచ్‌లు వచ్చినట్లు గుర్తించారు. అలోకం నవీన్‌ కుమార్‌ మధ్యవర్తిగా ఫహెర్దీన్‌ ముబీన్‌ నుంచి వాచ్‌లను హర్ష కొనుగోలు చేసినట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. విచారణలో అలోకం నవీన్‌ 100 కోట్ల విలువైన వస్తువులు స్మగ్లింగ్‌ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై మనీలాండరింగ్‌ సహా మరో కేసు నమోదు చేసిన ఈడీ విచారణ చేపట్టింది.

Tags

Next Story