ED Raids : హెచ్ఎండీఏ బాలకృష్ణ ఇంట్లో ఈడీ సోదాలు

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వ హించింది. అతని సోదరుడు నవీన్ కుమార్ ఇంట్లో కూడా ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ అధికారు లు తనిఖీలు చేస్తున్నారు. ఆదాయనికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అతడిని గతంలో అరెస్టు చేసింది. బాలకృష్ణ తన పదవిని అడ్డుపెట్టు కొని రూ. వందల కోట్లు సంపాధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన రూ.250 కోట్ల ఆస్తులను ఏసీబీ సీజ్ చేసింది. బాలకృష్ణను, ఆయన సోదరుడు నవీన్ కుమార్ ను ఏసీబీ అరెస్టు చేసింది. వీళ్లిద్దరూ బెయిల్పై బయటికి వచ్చారు. ఆ సమయంలో ఈడీ అధికారులు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈసీఐఆర్ నమోదు చేశారు. హెచ్ఎండీఏ, రేరా, మెట్రోలో జరిగిన అక్రమాలకు సంబంధి చిన కేసులో ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్న శివబాల కృష్ణపై హెచ్ఎండీఏ వేటు వేసింది. శివ బాలకృష్ణను 2024 జనవరిలో సస్పెండ్ చేస్తూ హెచ్ఎండీఏ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే కేసులోకి ఇవాళ ఈడీ ఎంట్రీ ఇచ్చింది. రాజేంద్రనగర్, చైతన్యనగ ర్ లోని శివ బాలకృష్ణ, ఆయన సోదరుడు నవీన్ కుమార్ నివాసాలపై దాడులు నిర్వహిస్తోంది. పలు కీలక పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకు న్నదని సమాచారం. అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్టులు మరియు లేఅవుట్ లకు అనుమతి మంజూరు చేయడం కోసం హైదరాబాద్లోని అగ్ర రియల్టర్లతో శివ బాలకృష్ణకు జరిగిన క్విడ్ ప్రోకో ఒప్పందాలను ఈడీ పరిశీలిస్తున్నట్టు సమాచారం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com