Editorial: ముచ్చటగా మూడోసారి... గట్టిగానే శ్రమించాలి మరి

Editorial: ముచ్చటగా మూడోసారి... గట్టిగానే శ్రమించాలి మరి
వివిధ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నేతల పరిస్థితిపై డీటైల్డ్ రిపోర్ట్...

టీఆర్ఎస్... బీఆర్ఎస్ గా మారింది. మరి టీఆర్ఎస్ లో ప్రస్థానం ప్రారంభించి రెండుసార్లు ఎన్నికైన ఎమ్మెల్యేలు మూడోసారి బరిలో నిలిచేందుకు సై అంటున్నారు. సీఎం కేసీఆర్ సైతం సిట్టింగ్ లకే టిక్కెట్లు అని శాసనసభా పక్ష మీటింగ్ లో స్పష్టం చేస్తుండంతో రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యేలు ధీమాతో ఉన్నారు. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచి అధికారాన్ని కైవసంచేసుకుంది..2023 ఎన్నికల్లో మరోసారి గెలిచేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు.



ఇప్పటికే టీఆర్ఎస్ ను జాతీయపార్టీ బీఆర్ఎస్ గా మార్చారు. మరే ఎమ్మెల్యేల్లో ఎంత మంది మరోసారి అసెంబ్లీలో అడుగుపెడతారు. సహజంగానే రెండు సార్లు గెలిచినవారి పై ..మూడోసారి గెలిపించాలంటే ..నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పై వ్యతిరేకత ను ఎదుర్కొవాల్సి ఉంటుంది.. రెండు సార్లు కారు సార్ సర్కార్ నినాదంతో సీఎం గా కేసీఆర్ అనే నినాదంతో ... చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే మొహాలు తెలవకున్నా... కారు బొమ్మ ను చూసి గెలిపించారు ప్రజలు.. అయితే మూడోసారి గెలవాలంటే ప్రభుత్వం పై వ్యతిరేకత ఉంటుంది.. ఎమ్మెల్యేల పై వ్యతిరేకత ఉంటుంది..ఇవన్నింటిని అధిగమించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్ధితి వారి నియోజకవర్గాల్లో ఎలా ఉంది.. మూడోసారి జనం ఊ అంటారా..ఊహూ అంటారా ఓ సారి చూద్దాం....



ఆదిలాబాద్ జిల్లాల్లో బెల్లంపల్లి, ఖానాపూర్, బోద్ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు దుర్గం చెన్నయ్య, రేఖానాయక్ , రాదోడ్ బాపురావు లువరుసగా రెండు సార్లు గెలిచారు.. బెల్లంపల్లి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం దుర్గం చెన్నయ్య మూడోసారి గెలవాలంటే చెమటోడాల్సినపరిస్దితే అంటున్నారు,, కేసీఆర్ మరోసారి సీఎం కావాలని నియోజకవర్గ ప్రజలు భావిస్తే తప్పా దుర్గం చెన్నయ్య గెలుపు అవకాశాలు తక్కువే అంటున్నారు, పనితీరు సైతం అంతంతమాత్రంగానే ఉందంటున్నారు.



2014 లో అనూహ్యంగా తెరపైకి వచ్చి రెండుసార్లు గెలిచాడు..ఈసారి గ్రందాలయ చైర్మన్ ప్రవీణ్ కుమార్ టికెట్ రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్టీ నియోజకవర్గాలు ఖానాపూర్ ,బోద్ నియోజకవర్గాల్లో ఇద్దరి పైనా ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఖానాపూర్ లో వరుసగా రెండు సార్లు గెలిచిన రేఖానాయక్ కు మంత్రిపదవి వస్తుందని ఆశించినా..నిరాశే ఎదురైంది. ఆమేకు స్ధానంలో పోటీకి జెడ్పీ చైర్మన్ రాదోడ్ జనార్దన్ , పూర్ణచందర్ టికెట్ కోసంప్రయత్నిస్తున్నారు.. మూడోసారి టికెట్ రేఖానాయక్ కు వస్తే .. తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందంటున్నారు.



ఇక బోధ్ లోను అదే పరిస్ధితి మూడోసారి అంటే వ్యతిరేకతను ఎదుర్కొవాలి, వివాదాలుసైతం బాపురావును చుట్టముడుతున్నాయి. మాజీ మంత్రి గోడం నగేష్ ,అనిల్ జాదవ్ ఇద్దరు టికెట్ ఆశిస్తున్నారు. గ్రూపు రాజకీయాలు ఏమేరకు బాపురావుకు కలిసివస్తాయనేది చర్చనీయాంశంగామారింది. హ్యాట్రిక్ అంత ఈజీ కాదనేది టాక్ .. ఆదిలాబాద్ నుంచి జోగురామన్న, మంచిర్యాల నుంచి దివాకర్ రావు సైతం సీనియర్ ఎమ్మెల్యేగా గెలుస్తువస్తున్నారు. జోగు రామన్న టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. దివాకర్ రావు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోచేరారు. మరోసారి పోటికి సై అంటున్నారు. మంచిర్యాలలో కాంగ్రెస్ బలమైన అభ్యర్ది రంగంలోకి దిగితే .,,దివాకర్ రావుకుఇబ్బందులు తప్పవంటున్నారు. అటు జోగు రామన్న కు కాస్త పాజిటివ్ అనే చెప్పవచ్చు.అక్కడ బీజేపీ అభ్యర్దినుంచి పోటి ఉంది..కాంగ్రెస్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.



ఇక నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ , నిజామాబాద్ అర్బన్, బాల్కొండ ,బోధన్ నియోజకవర్గాల్లో ముందు నుంచీ టీఆర్ఎస్ లో యాక్టివ్ గా ఉన్న జీవన్ రెడ్డి, బీగాలగణేష్, వేముల ప్రశాంత్ రెడ్డి, షకీల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా రెండుసార్లు గెలిచారు. వీరికే మూడోసారి టికెట్లు దక్కవచ్చు. పార్టీలో పెద్దగా పోటి ఇచ్చే ఇతర నేతలెవరూ కనపడటంలేదు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు సైతం బలహీనంగానే ఉన్నాయి..



కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు నియోజకవర్గంలో ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది. నిజామాబాద్ ఎంపీగా అర్వింద్ గెలిచన తర్వాత బీజేపీ కార్యాకలాపాలు ఊపందుకున్నాయి.. సో పోటీ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉంటుంది.. మిగితా ఆరు నియోజకవర్గాల్లో ఇతర పార్టీల్లో రాజకీయాలు చేసి ఎమ్మెల్యేలుగా గెలిచినవారు.. 2014 2018 లో గెలిచినవారున్నారు.. సో వారి పైనా నియోజకవర్గాల్లో వ్యతిరేకత కామనే.. స్పీకర్ పోచారం, నిజామాబాద్ రూరల్ బాజీరెడ్డి గోవర్దన్ తమవారసులను రంగంలోకి దింపేందుకు సిద్దమయ్యారు.


ఇక కరీంనగర్ జిల్లాలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరిమనోహర్ రెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ ముగ్గురు టీఆర్ఎస్ నుంచి రెండు సార్లు గెలిచారు. పెద్దపల్లి, మానకొండూరు, హుస్నాబాద్ లో బలమైన ప్రత్యర్దులు కాంగ్రెస్ , బీజేపీలో సైతం ఉన్నారు. ఇక్కడ మూడోసారి గెలవాలంటే కష్టపడాల్సిందే.



సిరిసిల్ల, కోరుట్ల, వేములవాడ, ధర్మపురి, కరీంనగర్ లో కేటీఆర్ , విద్యాసాగర్ రావు, చెన్నమనేని రమేష్, కొప్పుల ఈశ్వర్ , గంగుల కమలాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరంతా సీనియర్ ఎమ్మెల్యేలు.. వేములవాడలో రమేశ్ స్థానంలో మరొకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. పౌరసత్వం ఇష్యూ నడుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ ల నుంచి గట్టిపోటి ఎదుర్కోక తప్పదు.. ట్రయాంగిల్ పోరు నడిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.


ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగాం, వరంగల్ వెస్ట్, వర్దన్నపేట, మహబూబాబాద్ లో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, శంకర్ నాయక్ లు రెండు సార్లు గెలిచారు.. జనగాం, మహాబూబాబాద్ లో ఎమ్మెల్యేల పనితీరు ఆశాజనకంగాలేదు..నిత్యం వివాదాలతో అసంతృప్తి మూటకట్టుకుంటున్నారు. వరంగల్ వెస్ట్ , వర్దన్నపేటలో ప్రతిపక్షాలు బలహీనంగా ఉండటం కలిసివచ్చే అంశం. ఇక పరకాల, పాలకుర్తి, భూపాలపల్లి, డోర్నకల్ , స్టేషన్ ఘణపూర్ లలో ఇతరపార్టీల్లో ఎమ్మెల్యేలయి..టీఆర్ఎస్ లో చేరి గెలిచారు..వీరిపై సైతం వ్యతిరేకత కచ్చితంగా ఉంటుంది..


ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి 2014, 2018 లో ఆశాజనకంగాలేదు.. 2014 లో కొత్తగూడెం, 2018లో ఖమ్మం మాత్రమే కారు గెలిచింది. 2014 లో కొత్తగూడెం నుంచి జలగం వెంకటరావు గెలుపొందారు. వైయస్సార్ సీపీ కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు టీఆర్ఎస్ చేరిపోయారు. 2018లో టికెట్లు దక్కించుకున్నప్పటికీ ఖమ్మంలో పువ్వాడ అజయ్ తప్పా.. ఎవరూ గెలుపొందలేదు.. ఖమ్మంలో టీఆర్ఎస్ నుంచి రాజకీయాలు చేసి..ఎమ్మెల్యేలుగా గెలుపొందినవారు ఎవరూలేరనే చెప్పవచ్చు.



ఇతర పార్టీలనుంచి వచ్చిన వారి పై బీఆర్ఎస్ ఆధారపడకతప్పని పరిస్థితి.. 2023 ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ నుంచి మరోసారి పోటి ఎదుర్కొకతప్పేలా కనిపించడంలేదు.. ఆదిలాబాద్ , వరంగల్ , నిజామాబాద్ , కరీంనగర్ ,ఖమ్మం జిల్లాలలో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ నుంచి రెండు సార్లు గెలిచి..మూడోసారి కోసం వెయిట్ చేస్తున్నారు.. సో కేసీఆర్ మరోసారి టికెట్లు ఇస్తారా.. కొత్తవారిని ఎంపిక చేస్తారా అనేది వేచిచూడాల్సిందే...



ఇక దక్షిణ తెలంగాణ జిల్లాలు మెదక్ , మహాబూబూనగర్ , నల్గొండ, హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాల పరిశీలిస్తే ..


మెదక్ జిల్లాలో కేసీఆర్, హరీష్ రావు, పద్మాదేవేందర్ రెడ్డి, గజ్వేల్ సిద్దిపేట మెదక్ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ జిల్లాలో నర్సాపూర్ నుంచి మదన్ రెడ్డి, పటాన్ చెరు నుంచి గూడెం మహిపాల్ రెడ్డి గత రెండు టర్మ్ లుగా ఎమ్మెల్యేలుగా గెలిచారు. మదన్ రెడ్డి కి ఈసారి సునీతా లక్ష్మారెడ్డి నుంచి పోటి ఎదురయ్యే అవకాశం ఉంది. పటాన్ చెరులో ఎమ్మెల్యే పై వ్యతిరేకత ఉన్నా.. కాంగ్రెస్ , బీజేపీలు బలహీనంగా ఉన్నాయి.


మహాబూబునగర్ జిల్లాలో మహాబూబునగర్ , దేవరకద్ర, నాగర్ కర్నూల్, అచ్చంపేట, షాద్ నగర్ నియోజకవర్గాల్లో మంత్రి శ్రీనివాసగౌడ్, ఆల్లవెంకటేశ్వర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజ్, అంజయ్య లు రెండు సార్లు గెలిచారు.మూడోసారి బీఆర్ఎస్ టికెట్ పై పోటి చేసేందుకు రెడి అవుతున్నారు.. ఈ ఐదు నియోజకవర్గాల్లో అంతర్గత పోరు లేదనే చెప్పాలి. ఈ నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉన్నప్పటికి.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో సరైన అభ్యర్దులు లేరనే చెప్పవచ్చు..

ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో సూర్యాపేట, తుంగతుర్తి, ఆలేరు , భువనగిరి నియోజకవర్గాల్లో మంత్రి జగదీశ్వర్ రెడ్డి, గాదారి కిషోర్, గొంగిడిసునీత, శేఖర్ రెడ్డిలు వరుసగా గెలుస్తువస్తున్నారు.. మూడోసారి సైతం టికెట్ వీరికే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి..ఆలేరు లో సునీత బదులు ఆయన భర్త మహేందర్ రెడ్డి ఆశిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది.గత ఎన్నికల్లో సైతం గట్టి పోటి ఇచ్చినప్పటికి.. టీఆర్ఎస్ అభ్యర్దులే విజయం సాధించారు.. ఈసారి గెలుపు అంత ఈజీ కాకపోవచ్చు. ప్రభుత్వ వ్యతిరేకత,నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల వ్యతిరేకత ఎదుర్కొవాల్సి వస్తోంది.

ఇక హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాల్లో 28 నియోజకవర్గాల్లో మెజార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలనుంచి వచ్చినవారే ఉన్నారు. 2014 లో మెజార్టీ ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరారు. 2018 లో టీఆర్ఎస్ లోచేరిన ఎమ్మెల్యేందరికి టికెట్లు ఇచ్చారు. వారిలో తీగల కృష్ణారెడ్డి, మహేందర్ రెడ్డి ఇద్దరు ఓటమి చెందారు.. వీరిపై గెలిచిన సబితా ఇంద్రారెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి లు సైతం టీఆర్ఎస్ తీర్దం పుచ్చుకున్నారు. ఒక్క సికింద్రాబాద్ నుంచి గెలిచిన పద్మారావు 2014 2018లో వరుసగా గెలుపొందారు. మరోసారి పోటి చేస్తారా వారసున్ని రంగంలోకి దింపుతారా వేచి చూడాలి,, మొత్తంగా 28 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో ఉద్యమప్రస్తానం ప్రారంభించి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు ..టికెట్ మరోసారి వస్తే .. హ్యాట్రిక్ కోసం శ్రమించాల్సిందే....




Tags

Read MoreRead Less
Next Story