Editorial: ఎవరి లెక్కలు వారివే

Editorial: ఎవరి లెక్కలు వారివే
పదినెలల్లో ఎన్నికలు; అధికారం తమదే నంటూ అన్ని పార్టీల ధీమా; హ్యాట్రిక్ కోసం బీఆర్ఎస్; డెబ్బై లో ఫైట్ అంటున్న కాంగ్రెస్; ఢభై స్థానాల్లో గెలుపు మాదే అంటున్న బీజేపీ


షెడ్యూలు ప్రకారం మరో పది నెలల్లో తెలంగాణలో ఎన్నికలు. ఎన్నికల ఏడాది కావడంతో పార్టీలన్ని ఓటర్లను ప్రసన్నం చేసుకోనేపనిలో పడ్డాయి. పాదయాత్రలు, పబ్లిక్ మీటింగ్స్, స్టేజ్ కార్నర్ మీటింగ్స్ తో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు పోటా పోటిగా ప్రజల్లోకి వెళ్లుతున్నారు. మూడోసారి అధికారం ఖాయమంటూ బీఆర్ఎస్ ధీమాతో ఉ్ండగా... తామే అధికారంలోకివస్తామంటూ ప్రధాన ప్రతిపక్షపార్టీలు కాంగ్రెస్ , బీజేపీలు తొడగొట్టి అధికారపక్షానికి సవాల్ విసురుతున్నాయి. అటు కాంగ్రెస్ ఎంపీ కొమటిరెడ్డి వ్యాఖ్యలతో ఒక్కసారిగా పార్టీల్లో అలజడి రేగింది. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటదు సెక్యూలర్ పార్టీలు పొత్తు పెట్టుకోవాల్సిందేనంటూ కొమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కల్లొలాన్ని రేపాయి. వెంటనే బీజేపీ ఛీఫ్ బండి సంజయ్ చూశారా ముందునుంటి అంటున్నాం.. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ ఒక్కటే నంటూ చేసిన వ్యాఖ్యలు హీట్ రాజేశాయి.. అసలు ఎవరిలెక్కఎంత.. మూడోసారి అధికారంలోకి వస్తామంటున్న బీఆర్ఎస్ దీమా ఏంటి.. మాకు డెబ్బై గ్యారెంటి అంటున్న కాంగ్రెస్ లీడర్ల లెక్కేంటి.. ఒక్క సీటు తో మూడు కు పెంచుకున్నాం నెక్స్ట్ తొంబై పక్కా అంటున్న కమలనాధుల వ్యూహామేంటీ .

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ గా ఉండాలి అన్ని పార్టీలు సమాయత్తమవుతున్నాయి.. అధికారబీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు ముఖ్యంత్రి కేసీఆర్ తోపాటు మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఇప్పటికే మోజార్టీ జిల్లాల్లో పలు అబివృద్ది పనుల ప్రారంభోత్సవం ,శంకుస్థాపనలపేరుతో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సంక్షేమ ,అభివృద్ది పధకాలు, రైతుబందు, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పధకాలే తమకు మళ్లి విజయాన్ని చేకూరుస్తాయంటున్నారు. వందసీట్లు పక్కా అంటూ కేసీఆర్ పదే పదే ఎమ్మెల్యేల్లో ఆత్మస్తైర్యం నింపుతున్నారు కేసీఆర్ . అయితే దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు రెండోసారి గెలిచి హ్యాట్రిక్ కోసం పోరాడాల్సి ఉంది. మెజార్టీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ల పై వ్యతిరేకతఉందనేది వాస్తవం. 2018 ఎన్నికల్లో సైతం 40 నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉందని సర్వేల్లోనూ తేలింది. అయినప్పటికి కేసీఆర్ డేర్ చేసి ముందస్తుకు పోవడం ...ఆరుగురికి మినహా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి టికెట్లు ఇచ్చారు. సార్ కారు సర్కార్ నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన కేసీఆర్ కు ప్రజలు 88 సీట్లు ఇచ్చారు. అయితే ఈసారి టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. దేశంలో కీలకపాత్ర బీఆర్ఎస్ పోషిస్తోందంటూ ఇప్పటికే నాందేడ్ లో మొదటి సభ నిర్వహించారు. దేశ్ కి నేత కేసీఆర్ అంటూ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి బీఆర్ఎస్ శ్రేణులు.. రెండోసారి వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను మారుస్తారా లేదా కొత్తవారికి అవకాశం ఇస్తారా అన్నది చర్చనీయాంశమే.. మరో పదిహేను నియోజకవర్గాల్లో ఆదిపత్యపోరు నెలకొని ఉంది. ఎమ్మెల్సీ లు ఎమ్మెల్యేలు గా పోటి చేసేందుకు రెడి అవుతున్నారు. మరికొన్ని చోట్ల కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోచేరిన ఎమ్మెల్యేల సీట్లలో ..అసమ్మతి నెలకొని ఉంది. గత ఎన్నికల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి నినాదం బాగా పనిచేసింది. ప్రతిపక్ష కాంగ్రెస్ , బీజేపీల్లో కేసీఆర్ డీ కొనే సత్తా ఉన్న లీడర్లు లేకపోవడం మైనస్ గా మారింది. అయితే ఈసారి పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి , బీజేపీ చీఫ్ బండి సంజయ్ , కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ లాంటి వాళ్లు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారు. ఆయా పార్టీల్లో ఉన్న అసమ్మతి రేవంత్ సీనియర్ల మద్య విభేదాలు, బండిసంజయ్ ఈటల, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ , డికే అరుణ ఇలా బహూన్యాయకత్వం కనిపిస్తోన్నప్పటికి ఐక్యత లేకపోవడం ఆ పార్టీకి మైనస్ గా మారిందనే చెప్పవచ్చు

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రెవంత్ రెడ్డి హాత్ సే హత్ జోడో పాదయాత్ర ప్రారంబించారు. నేతలు సహకరించిన చోట పాదయాత్ర చేస్తున్నారు, ప్రజలతో మమేకం అవుతున్నారు. క్షేత్రస్తాయిలో ప్రభుత్వవ్యతిరేకత కాంగ్రెస్ కు లాభిస్తోందనే దీమాతో ఉన్నప్పటికి.. పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఒకింత డ్యామెజ్ చేస్తున్నాయనే చెప్పవచ్చు.. ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ఎన్నికల ముందునుంచి... తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినప్పటినుంచి .. చేస్తున్న కామెంట్స్ కాంగ్రెస్ కు ఇబ్బంది కరంగా మారింది. మోడీ అమిత్ షా నితిన్ గడ్కరిలతో సమావేశమవడం ..నియోజకవర్గ అభివృద్ది కోసం కలుస్తానని స్టైట్ మెంట్స్ ఇచ్చి.. కాంగ్రెస్ కు మోజార్టీ రాదని బాహాటంగానే చెప్పడం ఆపార్టీ నేతలకు మింగుడుపడటంలేదు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి సైతం ఆపార్టీ అధిష్టానం సాహసించలేకపోతుంది. రేవంత్ రెడ్డి తో పాటు సీనియర్లను సమన్వయం చేసే బాద్యతను ఇంచార్జీ ఠాక్రే

తీసకుంటున్నప్పటికి.. ఆశించిన స్తాయిలో ఐక్యత రావడంలేదు. ఇదే బీఆర్ఎస్ కు ప్లస్ గా మారింది. అటు వరుస ఓటములతో పార్టీ క్యాడర్ నిస్తేజంలో ఉంది. ఉపఎన్నికలు,జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో పత్తాలేకుండా పోయింది. ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత వస్తే.. ప్రత్యామ్నాయ పార్టీగా తమను ఎంచుకొంటారనే ఒక్క దీమాతో ఆపార్టీ కనిపిస్తోంది.. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు 40 నియోజకవర్గాల్లో సత్తా చూపే వాళ్లు ఉండటం ..కాస్త కష్టపడితే గెలుస్తారనే ఒక్క ఆశ పార్టీ నేతల్లో ఉంది...

ఇక బీజేపీ హైకమాండ్ జీహెచ్ ఎంసీ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణ పై దృష్టి పెట్టింది. మోడీ ఆమిత్ షా ఎప్పటికప్పుడు పార్టీ కీ సలహాలు ఇస్తున్నారు. సునీల్ బన్సాల్ ,తరుణ్ చుగ్ లాంటివారు రాష్ట్రంలో పర్యటిస్తూ పార్టీ విజయవకాశాలను అంచనావేస్తున్నారు. హైదరాబాద్ ,రంగారెడ్డి తోపాటు ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల బలంగా ఉంది.. నలుగురు ఎంపీలున్నప్పటికి .. క్షేత్రస్థాయిలో బలంలేదు. బండి సంజయ్ పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. ఇప్పుడు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ తో పదకొండు వేల సమావేశాలు ఏర్పాటు చేశారు. పలునియోజకవర్గాల్లో ఇప్పటికే మీటింగ్స్ సైతం నిర్వహించారు.ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్పించుకొని బలోపేతం అయ్యేందుకు వేసిన ప్లాన్ వర్కవట్ అవలేదనే చెప్పవచ్చు. దుబ్బాక హూజూరాబాద్ లో గెలిచినప్పటికి... మునుగోడు లో ఓటమి ఇతర పార్టీలనుంచి చేరే నేతలు సైతం పార్టీ మారేందుకు సహాసించలేకపోతున్నారు. ఆల్రేడి పార్టీ లో చేరిన ఈటేల రాజేందర్ లాంటి నేతలు సైతం ఇబ్బందిగా ఉంటున్నారనేది ఆ పార్టీలో చర్చించుకుంటున్నారు. మోడీ అమిత్ షా వ్యూహాల పై ఆ పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నారు.

కాంగ్రెస్ , బీజేపీలు రెండు పార్టీలు తమ సీఎం అభ్యర్ది పలానా అని చెప్ప స్ధితిలో లేకపోవడం ఆపార్టీలకు మైనస్ అనె చెప్పవచ్చు. బీఆర్ఎస్ లో సీఎం కేసీఆర్ మూడోసారి హ్యాట్రిక్ కోసం వ్యూహాలు రచిస్తున్నారు. కేంద్రంలో కీలకపాత్ర పోషించే స్ధితి ఏర్పడితే తప్పా.. కేసీఆర్ సీఎం రేసునుంచి తప్పుకోకపోవచ్చు...


మార్గం శ్రీనివాస్

Tags

Next Story