TG : పోలీస్ స్టేషన్ ముందు వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం

TG : పోలీస్ స్టేషన్ ముందు వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం
X

తాను అప్పుగా ఇచ్చిన రూ. 5 లక్షలను ఇప్పిం చాలని పీఎస్ చుట్టూ తిరిగిన వృద్ధురాలు.. చివరికి కూల్డ్రింక్లో పురుగుల మందు కలుపుకొని తాగి ఆదే పోలీస్ స్టేషన్ ఎదుట పడి పోయింది. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. పెగడపల్లి మండలం రాములపల్లి గ్రామనికి చెందిన తోట బాలమ్మకు జగిత్యాల కు చెందిన అశ్విని మహిళ అధిక వడ్డీ ఆశ చూపి రూ. 5 లక్షల నగదు, ఐదు తులాల బంగారం తీసుకుని ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తుంది. ఈ క్రమంలో తన డబ్బులు ఇప్పించాలని జగిత్యాల పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో ఇవాళ పోలీస్టేషన్ సమీపం లో కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహ త్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గమనించిన పోలీసులు హుటాహుటిన బాలమ్మను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు.

Tags

Next Story