హైదరాబాద్‌లో పర్యటిస్తున్న EC బృందం

హైదరాబాద్‌లో పర్యటిస్తున్న EC బృందం
సాధారణ ఎన్నికల్లో పాటించాల్సిన విధివిధానాలపై అవగాహన కల్పించనుంది.

హైదరాబాద్‌లో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటిస్తోంది. MCRHRDలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమయ్యింది. సాధారణ ఎన్నికల్లో పాటించాల్సిన విధివిధానాలపై అవగాహన కల్పించనుంది. రానున్న ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేంద్ర ఎన్నికల బృందం 4 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనుంది.సమస్యాత్మక ప్రాంతాలు, స్ట్రాంగ్‌ రూమ్స్ పోలింగ్‌ కేంద్రాల దగ్గర భద్రతపై సమీక్షించనుంది.ఓటర్ల జాబితాలో తప్పుల సవరణపై ఇప్పటికే సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఓటింగ్ శాతం పెంచేలా ఓటింగ్ శాతం తక్కువ నమోదవుతున్న కేంద్రాల్ని గుర్తించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. యువత పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనేలా అవగాహన కల్పించాలని సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story