TG : ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించండి : మంత్రి శ్రీధర్ బాబు

TG : ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించండి : మంత్రి శ్రీధర్ బాబు
X

భావితరాల అవసరాలకు అను గుణంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేలా ఫ్రెంచ్ కంపెనీలను ప్రోత్సహించాలని ఇండో - ఫ్రెంచ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ (ఇ ఫ్కీ) ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఇవాళ సెక్రటేరియట్ ఇఫ్కీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలు, ప్రభుత్వ తరఫున అందిస్తున్న ప్రోత్సాహాకాలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేయాలనే దూరదృష్టి తోనే సీఎం రేవంత్ రెడ్డి 30వేల ఎకరాల్లో పీపీపీ విధానంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టిన్నట్లు చెప్పారు.' ఏడాదిన్నర వ్యవధిలోనే తెలంగాణకు రూ.3 లక్షల కోట్ల పెట్టబడులొ చ్చాయి. గతేడాది హైదరాబాద్ లో 70 జీసీసీలు ప్రారంభమయ్యాయి. పారిశ్రామికవేత్తలకు మా ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శ నం. పరిశ్రమలకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ' అని శ్రీధర్ బాబు అన్నారు. ఈ సమా వేశంలో ఇఫ్కీ నుంచి యోహాన్ సామ్యూల్, పలు ఫ్రెంచ్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags

Next Story