England vs India: 354 రన్స్ ఆధిక్యంలో ఇగ్లాండ్.. తొలి వికెట్ కోల్పోయిన భారత్

England vs India: లీడ్స్ వేదికగా జరుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 354 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 423/8తో మూడో రోజు ఆట ఆరంభించిన ఇంగ్లాండ్ మరో 10 పరుగులు మాత్రమే. 132.2 ఓవర్లు ఆడిన ఆ జట్టు ఏకంగా 432 పరుగులు చేసింది. క్రెయిగ్ ఓవర్టన్ (32) షమి వేసిన 130వ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు. 132వ ఓవర్లో షమి బౌలింగ్‌లోనే వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో ఆటగాడు రాబిన్సన్ (0) ఖాతా తెరవలేదు. బుమ్రా వేసిన 132.2వ బంతికి బౌల్డ్ అయ్యాడు. జెమ్మీ అండర్సన్ అజేయంగా నిలిచాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 78 పరుగులకే ఆలౌటైంది.
అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్ ఆదిలోనే కీలక వికట్ కోల్పోయింది. ఓపెనర్ రాహుల్ 8 పరుగులు చేసి కీపర్ క్యాచ్ ఇచ్చి వెలనుదిరిగాడు. దాంతో భారత్ వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది. భారత్ 320 పరుగుల వెనకంజలో ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com