TG : ఎంట్రన్స్ అలర్ట్.. జూన్ ఫస్ట్ తేదీన ఎడ్ సెట్

X
By - Manikanta |7 Feb 2025 4:45 PM IST
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) రెండేళ్ల వ్యవధి గల కోర్సులో ప్రవేశానికి ఏటా నిర్వహించే ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎడ్సెట్) ను జూన్ 1 వ తేదీన జరపాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఈ మేరకు ఎడ్సెట్ పూర్తి షెడ్యూల్ను గురువారం విడు దల చేసింది. జూన్ 1న జరిపే ఈ పరీక్షకు వచ్చే నెల (మార్చి 10న నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు ప్రకటించింది. మార్చి 12 నుంచి దరఖాస్తులు స్వీకరించను న్నారు. జూన్ 1న నిర్వహించే ఈ పరీక్షను ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో జరుగనుంది.
మొదటి సెషన్: ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు,
రెండవ సెషన్: మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 4:00 వరకు నిర్వహిస్తారు.
మార్చి 10న నోటిఫికేషన్ మార్చి 12 నుండి దరఖాస్తుల స్వీకరణ.
జూన్ 1న పరీక్ష
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com