TG : తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. బీటెక్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే EAPCETను ఏప్రిల్ 29 నుంచి నిర్వహిస్తామని తెలిపింది. ఏప్రిల్29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ, మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ పరీక్షలు ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు ఈ పరీక్షలకు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. పలు ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్షలు ప్రతి ఏటా నిర్వహిస్తారు.
పరీక్షల షెడ్యూల్:
ఏప్రిల్ 29 నుండి మే 5 వరకు ఎప్ సెట్ (eapcet)
(ఏప్రిల్ 29, 30న అగ్రికల్చర్, ఫార్మసీ)
(మే 2 నుంచి 5 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్)
మే 12న ఈ సెట్
జూన్ 1న ఎడ్ సెట్
జూన్ 6న లా సెట్, పీజీ ఎల్.సెట్
జూన్ 8, 9న ఐసెట్
జూన్ 16 నుంచి 19 వరకు పీజీ ఈసెట్
జూన్ 11 నుంచి 14 వరకు పీ సెట్ పరీక్షలు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com