ఒక్కరి వల్లే తెలంగాణ రాలేదు.. నాడు ఉద్యమాన్ని నడిపించాం కాబట్టే : ఈటెల

X
నాడు ఉద్యమం నడిపించాం కాబట్టే.. నేడు తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందని బీజేపీ నేత ఈటెల రాజేంద్ర అన్నారు. జమ్మికుంట మండలంలో ప్రజా దీవెన పాదయాత్రను ఈటెల కొనసాగిస్తున్నారు. ఒక్కరి వల్ల తెలంగాణ రాలేదని ఆయన తెలిపారు. తనకు అన్నీ ఇచ్చామని గులాబీ నేతులు చెపుతున్నారన్న ఆయన.. మాజీ ఎంపీలు కవిత, వినోద్ కుమార్‌లకు బంగారు పల్లెంలో పెట్టి బీఫాం ఇచ్చారు కదా.. వారు గెలిచారా అని ప్రశ్నించారు. ఇవ్వడం మీ వంతు కావచ్చు కానీ.. కష్టపడి ప్రజల ఆశీర్వాదం పొందామని ఆయన తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
