ఓట్ల కోసం పనులు చేయవద్దు: ఈటల రాజేందర్

Etela Rajender (File Photo)
మనుషుల్ని కులాల ఆధారంగా గౌరవించడం దుర్మార్గమని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సమాజంలో అంతరాలు పోయేంత వరకు అందరూ పోరాడాలని చెప్పారు. సమాజంలో బలహీన వర్గాల వారు రెండో శ్రేణి పౌరులుగా, వెనుకబడిన వాళ్లుగా ఎందుకున్నారని ప్రశ్నించారు. సమసమాజం కోసం అంబేడ్కర్ కన్న కలలు నిజం చేయాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య 94 వ జయంతి కార్యక్రమంలో ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా చట్టాలు చేయాలని, ఓట్ల కోసం పనులు చేయవద్దని అభిప్రాయపడ్డారు.
ప్రజల ఆత్మగౌరవానికి వెలగట్టే పరిస్థితి వచ్చిందని.. ఓటుకు వెలగట్టడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. చైతన్యం చంపబడితే ఉన్మాదం వస్తుందని అభిప్రాయం వ్యక్తంచేశారు. అణగారిన బ్రతుకుల గురించి చివరి వరకు పోరాడిన నోముల నరసింహయ్య కుమారుడు భగత్‌ను నాగార్జున సాగర్ ఉపఎన్నికలో గెలిపించాలని పిలుపునిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com