TG : మూసీ ప్రక్షాళన చేయండి.. పేదల కూల్చివేతలు ఆపండి.. ఈటల ఫిట్టింగ్

మూసీ ప్రక్షాళన వెనుక సీఎంకు ఉందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. గురువారం సాయంత్రం కంటోన్మెంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈటల మాట్లాడుతూ కంటోన్మెంట్లో చేపట్టిన డిజి టల్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, అయితే ఇష్టానుసారంగా ఇళ్ల కూల్చివేతను మాత్రమే తాము ప్రశ్ని స్తున్నామని వెల్లడించారు.
మూసీ ప్రక్షాళన పేరిట కూల్చివేస్తున్న వారివద్దకు సెక్యూరిటీ లేకుండా సీఎం రావాలన్నారు ఈటల. బాధితులు సీఎం చర్య లను మెచ్చుకుంటే తాను ముక్కు నేలకు రాసి రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారని గుర్తుచేశారు. భారీ మూసీ ప్రక్షాళన పేరిట భారీస్థాయిలో అవినీతికి పాల్పడే అవకాశముందన్నారు. సబర్మతి, గంగా ప్రక్షాళనకు గురించి మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, ఆయా ప్రాజెక్టులకు ఎంత వ్యయం అయిందో తెలుసుకోవాలన్నారు. సబర్మతి రివర్ ఫ్రంటికి రూ.1400 కోట్లు ఖర్చు పెడుతున్నారని, 2500 కిలోమీటర్ల మేర విస్తరించిన గంగా ప్రక్షాళన కోసం రూ. 20 వేలకోట్లు ఖర్చు మాత్రమే ఖర్చుపెట్టారన్నారు. మరి మూసీ కోసం రూ. 1.50 లక్షల కోట్లు ఎందుకు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నాలుగు నెలలుగా జీతాలు లేవని, గ్రామపంచాయతీలో పనులు చేసిన వారికి మూడేళ్లుగా బిల్లులు ఇవ్వడం లేదని తెలిపారు. ఆర్టీసీకి ఇచ్చిన రూ.280 కోట్ల చెక్కు కూడా బౌన్స్ అయిందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com