హైదరాబాద్ కు చేరుకున్న ఈటల .. రేపే రాజీనామా ?

హైదరాబాద్ కు చేరుకున్న ఈటల .. రేపే రాజీనామా ?
X
ఢిల్లీ టూర్ ముగించుకుని ఈటల రాజేందర్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు.

ఢిల్లీ టూర్ ముగించుకుని ఈటల రాజేందర్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. అయితే.. బీజేపిలో ఎప్పుడు చేరుతున్నారనే ప్రశ్నలకు ఈటెల బదులివ్వలేదు. టీఆర్ఎస్ కి, ఎమ్మెల్యే పదవికి ఆయన రేపే రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసిన తర్వాతే బీజేపీలో చేరాలని ఆయన నిర్ణయించుకున్న నేపథ్యంలో హుజురాబాద్ బై పోల్ కూడా ఆయన సిద్ధమయ్యారు. రేపు రాజీనామా తర్వాత మీడియాతో మాట్లాడనున్నారు. ఈ నెల 8 లేదా 9 తేదీల్లో ఢిల్లీ వెళ్లి ఆయన బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఆయనతో పాటు మరో అయిదుగురు నేతలు కూడా కాషాయ కండువ కప్పుకొనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే బీజేపీ నేతలతో ఈటెల భేటీ అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.



Tags

Next Story