Raja Singh : బీజేపీలో లేకపోయినా మోదీ, యోగీ పిలుపును పాటిస్తా

తెలంగాణ రాజకీయాల్లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ టాపిక్‌గా మారారు. బీజేపీకి ఇటీవల రాజాసింగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. కిషన్ రెడ్డి పార్టీని నాశనం చేస్తున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం నిర్ణయం తర్వాతే తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లోకి వెళ్లేది లేదన్నారు రాజాసింగ్. శివసేనలో చేరాలంటూ రాజాసింగ్‌పై కార్యకర్తలు, అభిమానుల ఒత్తిడి ఉంది. మహారాష్ట్రలో కరుడుగట్టిన హిందుత్వ పార్టీగా శివసేనకు పేరు ఉంది. అటు మహారాష్ట్ర నుంచి హిందుత్వ పార్టీలు ఆహ్వానిస్తున్నాయని రాజాసింగ్ అంటున్నారు. మహారాష్ట్రలో నాపై 17 కేసులు ఉన్నాయని తెలిపారు. బీజేపీలో తాను లేకపోయినా హిందుత్వ పార్టీలోనే ఉంటా.. హిందుత్వం కోసం కొట్లాడుతానని రాజాసింగ్ వెల్లడించారు. బీజేపీలో లేకపోయినా మోదీ, యోగీ పిలుపును పాటిస్తానని వెల్లడించారు. తనకు బీజేపీలో ఇష్టమైన నాయకులు నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా అలాగే యూపీ సీఎం యోగీ ఆదిత్యనాధ్ అని ఆయన అన్నారు. తన రాజీనామా మీద బీజేపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూస్తాను అని ఆయన కోసమెరుపు మెరిపించారు. కాగా గోషామహల్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రాజా సింగ్
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com