Harish Rao : ప్రతి డిసెంబర్ 31న రాత్రి ఎస్సీ హాస్టల్లో అన్నం తింట : హరీష్ రావు

కాంగ్రెస్ ఏడాది పాలనలో 1,918 ప్రభుత్వ పాఠశాలలు మూత పడ్డాయని, ఇప్పటికైనా ఆ పాఠశాలల్లో టీచర్లను పెట్టి స్కూళ్లు తెరిపించాలని సూచించారు మాజీ మంత్రి హరీష్ రావు. తాను 21 ఏండ్లు ఎమ్మెల్యేగా ఉన్నా నని, 15 ఏండ్లుగా డిసెంబర్ 31న రాత్రి ఎస్సీ హాస్టల్లో అన్నం తిని, అక్కడి విద్యార్థులతో కలిసి వేడుక జరుపుకుంటానని వెల్లడించారు. విద్యార్థుల సమస్యలపై హరీశ్ రావు మాట్లాడుతుంటే అధికార పార్టీ ఎమ్మెలేలు శంకర్, రాంచందర్ నాయక్, వెడ్మ బొజ్జు నాన్స్టాప్ రన్నింగ్ కామెంటరీ చేస్తూనే ఉన్నారు. దీంతో హరీశ్రావు మీరు జర నోరు మంచిజేస్కోవాలె అని సీరియస్ గా చెప్పారు. పీవీ నర్సింహారావు సర్వేల్లో మొదటి గురుకులం ప్రారంభించారని, 43 ఏండ్లలో ప్రారం భించిన గురుకులాలు 203 మాత్రమేనని, - కానీ బీఆర్ఎస్ హయాంలో 819 ఏర్పాటు చేసిందని, విద్యార్థుల సంఖ్య 2 లక్షల నుంచి నేడు 10 లక్షలకు పెరిగిందని, నాడు కొలిచి అన్నం పెడితే, కేసీఆర్ సన్నబియ్యంతో కడుపు నిండా అన్నం పెట్టారని అన్నారు విదేశాల్లో చదివించేందుకు రూ.20 లక్షల స్కాలర్షిప్స్ అందించిన దేశంలో ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com