PCC Chief : అందరి రిపోర్ కేసీ దగరుంది.. చిట్ చాట్ లో పీసీసీ చీఫ్

వచ్చే 20 ఏండ్లను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని కేసీ వేణుగోపాల్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. అందరి రిపోర్ట్ కేసీ దగ్గర ఉందని అన్నారు. ఇవాళ గాంధీభవన్ లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. టీచర్ల ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థిని బరిలోకి దించబోమని, మిత్రపక్షాల అభ్యర్థికి మద్దతిస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి నలుగురి పేర్లు పరిశీలన లో ఉన్నాయని, చాలా మంది ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి పేరు చెబుతు న్నారని అన్నారు. రెండు మూడు రోజుల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరనేది ప్రకటిస్తామని చెప్పారు. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలను పరిశీలించాక నిర్ణయం తీసుకుంటామని అననారు.ఈ నెల 14న ఢిల్లీ వెళ్తున్నామని చెప్పారు. 15 ఢిల్లీలో జరిగే ఏఐసీసీ ఆఫీస్ ప్రారంభోత్సవంలో పా ల్గొంటామని అన్నారు. ఈ నెలాఖరు నాటికి, కార్పొరేషన్ల పదవులను, పార్టీకి సంబంధిం చిన అన్ని కమిటీలను భర్తీ చేస్తామని చెప్పారు. పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు ఇస్తామ ని వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com