ప్రశ్నిస్తే నిర్బంధిస్తారా...మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్

సీఎం కేసీఆర్ గద్వాల జిల్లా పర్యటనపై విపక్షాల విమర్శలు గుప్పిస్తున్నాయి. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రతిపక్ష నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. శాంతినగర్‌లో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌ను గృహ నిర్బంధం చేశారు. నిర్బంధాలపై ప్రతిపక్ష నేతలు భగ్గుమంటున్నారు.
గద్వాల జిల్లాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదిస్తున్నారు. ప్రశ్నిస్తే నిర్బంధిస్తున్నారని సంపత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అల్లంపూర్ నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఇక తుమ్మిళ్ల లిఫ్ట్ రిజర్వాయర్లను మరిచారని.. డిగ్రీ కళాశాల, మినీ బస్సు డిపో, ఫైర్ స్టేషన్ ఊసేలేదన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుంబడిందని.. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్‌కు ఓటమి తప్పదని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com