TG : ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్ .. ఎగ్జామ్ ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ రిలీజ్

X
By - Manikanta |5 Nov 2024 11:30 PM IST
ఇంటర్ ఫస్టియర్, సెకండి యర్టూడెంట్లకు విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఫైనల్ ఎగ్జామ్ పరీక్ష ఫీజు చెల్లిం పునకు షెడ్యూల్ విడుదల చేసింది. రేపటి నుంచి ఈనెల 26 వరకు ఫీజు చెల్లించేందు కు అవకాశం కల్పించింది. రూ. 100 ఫైన్ డిసెంబర్ 4 వరకు, 500 పెనాల్టీతో వచ్చే నెల 12 వరకు ఫీజు కట్టేందుకు చాన్స్ ఇచ్చింది. రూ. 1000 జరిమానాతో డిసెంబర్ 18 వరకు, రూ. 2000 ఫైన్ డిసెంబర్ 27 వరకు గడువు ఫీజును చెల్లించే అవకాశం కల్పించారు. ఫస్టియర్ జనరల్ కోర్స్ అభ్యర్థు లకు ఫీజు రూ.520, ఒకేషనల్ కోర్స్ - ప్రాక్టిక ల్స్ రూ.750, సెకండియర్ జనరల్ కోర్స్ ఆర్ట్స్ రూ.520, కోర్స్ సైన్స్ రూ.750, సెకం డియర్ ఒకేషనల్ కోర్స్ (థియరీ+ప్రాక్టికల్స్) రూ.750గా నిర్ణయించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com