TG : షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు : బుర్రా వెంకటేశం

నిరుద్యోగులు, ఉద్యోగార్తుల కోసం టోల్ ఫ్రీ నంబర్ అమల్లోకి తెస్తామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం చెప్పారు. ఇవాళ కమిషన్ భవనంలో ఆయన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ పదవిలోకి రావడం ఆనందంగా ఉంద న్నారు. తాను ఐదున్నరేండ్ల పాటు పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు. పరీక్షలన్నీ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయ ని, అందరూ బాగా చదుకొని ధైర్యంగా పరీక్షలు రాయాలని అన్నారు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాట లు చెబితే నమ్మొద్దని, పోలీసులకు ఫిర్యాదులు చేయాలని చెప్పారు. పరీక్షల నిర్వహణను స్పీడప్ చేస్తామని చెప్పారు. తనకు ఐఏఎస్ లో 15 వ ర్యాంకు వచ్చిందని గుర్తు చేశారు. తనకు ఇంకా మూడున్నరేండ్లు సర్వీసు ఉన్నా నిరుద్యోగుల కోసం టీజీపీఎస్సీ చైర్మన్ గా జాయిన్ అయ్యానని అన్నారు. రాష్ట్రంలో మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామని వివరించారు. తన కలను ఎలా సాకారం చేసుకున్నానో.. ని రుద్యోగుల కలను అదే విధంగా సాకారం చేస్తానని చెప్పారు. ఇప్పటి వరకు తప్పులు చేసిన వారు ఎవరైనా కమిషన్ ఉంటే స్వచ్ఛందంగా తప్పుకోవాలని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com