TG : శామీర్ పేట రేషన్లు, పెన్షన్ల గ్రామ సభలో రసాభాస

TG : శామీర్ పేట రేషన్లు, పెన్షన్ల గ్రామ సభలో రసాభాస
X

మేడ్చల్ జిల్లా తుంకుంట మున్సిపాలిటీ పరిధిలోని శామీర్ పేటలో గ్రామ సభ రసాభాసగా మారింది. గ్రామంలో ప్రజా పాలన వార్డు సభ ఎంఆర్వో యాదగరి, ఎంపీడీఓ మమతా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ గ్రామ సభలో మహిళలు వృద్దులు అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఇప్పటివరకు పెన్షన్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల వంటి సంక్షేమ పధకాలు అందడం లేదంటూ ఆందోళన చేశారు. సొంత ఇండ్లు లేక అద్దె ఇంట్లో ఉంటూ నెలకు పది వెలు కిరాయి కడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల కోసం కలలు కంటే ఆశలు నిరాశలు అయ్యాయాంటూ కన్నీటి పర్వాంతమయ్యారు. ఏ ప్రభుత్వం వచ్చినా నిరుపేదలకు ఎటువంటి న్యాయం జరగదంటూ ప్రభుత్వం పై నిప్పులు చేరిగారు. పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకే అన్ని పధకాలు అందిస్తున్నారుని.. సామాన్య ప్రజలకు న్యాయం జరగడం లేదంటూ అధికారులను నిలదీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితులను అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.

Tags

Next Story