BRS Public Meeting : బీఆర్ఎస్ సభ నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు

BRS Public Meeting : బీఆర్ఎస్ సభ నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు
X

తెలంగాణ నలుమూలల నుంచి తరలివచ్చే గులాబీ సైనికులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దని హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను నిర్వహిస్తున్నామన్నారు. 1250 ఎకరాల్లో బహిరంగసభతో పాటు పార్కింగ్ ఏర్పాట్లను ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. వెయ్యి ఎకరాల్లో 30 నుంచి 40 వేల వాహనాల పార్కింగ్ కు వసతులు ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. సభకు నలువైపుల పార్కింగ్ స్థలాలు ఉండటంతో ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తదన్నారు. సభకు వచ్చే ప్రజలకు పదిలక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షల మజ్జిక ప్యాకెట్లను అందుబాటులో ఉంచడం జరుగు తుందన్నారు. ఎండతీవ్రంగా కొడుతున్నందున ఎలాంటి సమస్య తలెత్తినా... వెంటనే వైద్యం అందించేందుకు 100 వైద్య బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు అత్యవసర వైద్యసేవల కోసం 15 అంబులెన్స్లను ఏర్పాటుచేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్ సరఫరా తమకు నమ్మకంలేదన్నారు. అందుకే 200 జనరేటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

Tags

Next Story