TG : ఫ్యాన్సీ నెంబర్లతో ఆర్టీఏకే మస్తు ఆమ్దాని

TG : ఫ్యాన్సీ నెంబర్లతో ఆర్టీఏకే మస్తు ఆమ్దాని
X

ఫ్యాన్సీ నెంబర్లకు వాహనదారులు మొగ్గు చూపుతుండటంతో.. రవాణాశాఖకు కాసుల వర్షం కురిపిస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫ్యాన్సీ నెంబర్ల కోసం ఆన్ లైన్‌లో బిడ్డింగ్ వేస్తున్నారు. హైదరాబాద్ ఆర్టీఏ పరిధిలోని సెంట్రల్ జోన్ ఖైరతాబాద్ పరిధిలో మంగళవారం ఫ్యాన్సీ నెంబర్ల బిడ్డింగ్ ను ఆన్ లైన్‌లో నిర్వహించారు. మొత్తం 9 నెంబర్లకు 52,52,283 ఆదాయం వచ్చినట్లు జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేష్ తెలిపారు. ఇందులో TG 09 D 0001 నెంబర్ కు రూ. 11,11,111 లకు అమ్ముడు పోయి రికార్డులో నిలిచింది. అలాగే TG 09 D 0009 నెంబర్ కు 10,40,000, TG 09 C 9999 నెంబర్ కు 7,19,999, TG 09 D 0006 నెంబర్ కు రూ.3,65,000, TG 09 D 0005 నెంబర్ కు రూ. 3,45,000, TG 09 D 0007 నెంబర్ కు 2,06,569లు, TG 09 D 0019 నెంబర్ కు 1,95,009, TG 09 D 0099 నెంబర్ కు 1,85,000లు, TG 09 D 0077 నెంబర్ కు రూ.1,17,789 వచ్చినట్లు జేటీసీ తెలిపారు.

Tags

Next Story