RTC : దసరా స్పెషల్ బస్సుల్లో ఛార్జీలు పెంపు!

దసరా స్పెషల్ బస్సుల్లో సవరించిన ఛార్జీలు అమల్లో ఉంటాయని RTC ప్రకటించింది. దీంతో టికెట్ ధర 50% పెరిగే అవకాశం ఉంది. ఈ నెల 20, 27-30, అక్టోబర్ 1, 5, 6 తేదీల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో ఈ సవరణ ఛార్జీలు అమల్లో ఉంటాయి. రెగ్యులర్ సర్వీసుల ఛార్జీల్లో మార్పు ఉండదని సంస్థ తెలిపింది. 2003లో ప్రభుత్వం జారీ చేసిన GO 16 ప్రకారం స్పెషల్ బస్సులకు ఛార్జీలు సవరిస్తున్నట్లు RTC గతంలో పలుమార్లు వివరణ ఇచ్చింది. ఈ పండుగల కోసం రాష్ట్రవ్యాప్తంగా 7,754 స్పెషల్ బస్సులను బస్సులను నడపడానికి తెలంగాణ ఆర్టీసీ ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో 377 స్పెషల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించింది.ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. నడపనుంది. సద్దుల బతుకమ్మ ఈ నెల 30న, దసరా అక్టోబర్ 2న ఉన్నందున.. ఈ నెల 27 నుంచే సొంతూళ్లకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో ఆ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com