KTR : కాంగ్రెస్ అరాచక పాలన తో రైతులకు ఇబ్బంది: కేటీఆర్

గత 18 నెలల నుంచి తెలంగాణలో సాగుతున్న కాంగ్రెస్ అరాచక పాలన తో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని బీఆర్ఎస్ వర్కి్ంగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రైతుల సంక్షేమంపై చర్చకు సీఎం రేవంత్ కోసం వేచి చూసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నోటికొచ్చిన హామీలు, నోటికి వచ్చిన వచ్చిన వాగ్దానాలు, 420 హామీలు, వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు అని డైలాగులు కొట్టి గత 18 నెలలుగా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులను, కోట్లాది కుటుంబాలను కాంగ్రెస్ దగా చేసింది. తెలంగాణ రైతాంగానికి, యువతకు ఎవరేం చేశారో తేల్చుకుందాం రమ్మని ముఖ్యమంత్రి గారు విసిరితే స్వీకరించి నేను వచ్చాను. బేసిన్ నాలెడ్జి లేని రేవంత్ రెడ్డికి బేసిక్ నాలెడ్జి లేదని తెలిసినా కూడా ముఖ్యమంత్రి ముచ్చట పడుతున్నాడు కదా అని సవాల్ ను స్వీకరించాను. బేసిన్ నాలెడ్జ్ , బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టే ఓ 72 గంటల టైం ప్రిపరేషన్ కోసం ఇచ్చి రమ్మన్నాను. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని చెప్పాను. జులై 8 తారీఖున 11 గంటలకు మేమే ప్రెస్ క్లబ్ కు వస్తాము, మీడియా సాక్షిగా, ప్రజల సాక్షిగా చర్చిద్దామంటే ఇవాళ రేవంత్ రాకుండా ఢిల్లీకి పోయిండు. ఒకవేళ ముఖ్యమంత్రి రాలేకపోతే ఆయన తరపున బాధ్యత గల ఉప ముఖ్యమంత్రి గాని, వ్యవసాయ మంత్రి గానీ, లేదంటే ఇంకెవరైనా మంత్రులను పంపుతారని అనుకున్నా. కానీ రేవంత్ రెడ్డికి రచ్చ చేయడమే వచ్చు కాని చర్చ చేయడం రాదని ఇవాళ తేలిపోయింది. రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం వస్తుంది కానీ రైతుల గురించి మాట్లాడడం రాదని స్పష్టంగా తెలిసిపోయిందని కేటీఆర్ వ్యాఖ్యనించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com