TG : ఐటీ కట్టేవారికీ రైతు భరోసా?... కండిషన్లతో రేవంత్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా?

TG : ఐటీ కట్టేవారికీ రైతు భరోసా?... కండిషన్లతో రేవంత్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా?
X

రైతుభరోసా విధివిధానాలపై క్లారిటీ వస్తోంది. నిర్ణీత ఎకరాల లోపు ఉన్నవాళ్లు ఎవరు వ్యవసాయం చేస్తున్నా వారికి సాయం చేసేలా స్టెప్స్ తీసుకుంటున్నారు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు. ఐటీ చెల్లించేవారితో పాటు... ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, వైద్యులు, న్యాయవాదులు, ఇంజినీర్లకు పీఎం- కిసాన్‌ పథకంలో పెట్టుబడి సాయం అందటంలేదు. మొదట ఈ క్యాటగిరీలోనివారికి రైతు భరోసా పేరుతో పంట సాయం ఇవ్వొద్దనే ఆలోచన చేసినప్పటికీ... గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్న రేవంత్ ప్రభుత్వం నిర్ణయం మార్చుకున్నట్టు సమాచారం. దీంతో.. వేతన జీవుల్లోనూ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

Tags

Next Story