Dil Raju : దిల్ రాజు యొక్క లావాదేవీలు, సినిమాల కలెక్షన్లపై ఐటీ ప్రశ్నలు

Dil Raju : దిల్ రాజు యొక్క లావాదేవీలు, సినిమాల కలెక్షన్లపై ఐటీ ప్రశ్నలు
X

సినిమా, వ్యాపారాలకు సంబంధించిన లావా దేవాలపై ఎఫ్‌డీసీ చైర్మన్, నిర్మాత దిల్ రాజును ఐటీ అధికారులు విచారించారు. గత నెలలో దిల్ రాజుతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో, ఆఫీసుల్లో ఐటీ అధికారులు నాలుగు రోజుల పాటు సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఇటీవల సంక్రాంతికి విడుదలైన సినిమాలు, వ్యాపారాలకు సంబంధిన లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలించారు. సినిమా రంగంలో పెట్టుబడులు, సినిమాల కలెక్షన్లకు సంబంధించిన వివరాలు సేకరించిన ఐటీ అధికారులు విచారణకు రావాలని దిల్ రాజుకు గత నెలలో నోటీసులు ఇచ్చారు. దీంతో దిల్ రాజు డాక్యుమెంట్స్, బ్యాంకు వివరాలతో మంగళవారం ఐటీ అధికారుల విచారణకు హాజరయ్యాడు.

సినిమాల నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ లాభాల వ్యవహారాలపై ఐటీ అదికారులను దిల్ రాజును ఆరా తీశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సంక్రాంతికి తన నిర్మాణంలో సంక్రాంతికి రెండు సినిమాల విడుదల చేయగా ఆయా సినిమాలకు కలెక్షన్లపై వివరాలు కోరారు. అదేవిధంగా దిల్ రాజు సహా ఆయన కూతురు, అలాగే సోదరుడు శిరీష్ ఇళ్లలో, ఆఫీసుల్లో విస్తృత తనికీలలో లభించిన అధారాలపై వివరణ కోరారు. అలాగే 2023 నుంచి 2025 వరకు సినీ నిర్మాణానికి సంబంధించిన పెట్టుబడులు, వచ్చిన ఆదాయాలకు సంబంధించి పూర్తి వివరాలపై ప్రశ్నించారరు. అలాగే ఇటీవల విడుదలైన సినిమాలకు వచ్చిన ఆదాయానికి, చెల్లించిన పన్నులకు భారీ వ్యత్యాసాలు ఉన్నాయన్న కోణంలో విచారణ చేపట్టారు. గత రెండేళ్లుగా దిల్రాజు బ్యానర్లో నిర్మించిన సినిమాలకు సంబంధించి కొంత సమాచారాన్ని ఐటీ అధికారులు రాబట్టారు. పెట్టిన పెట్టుబడికి, వచ్చిన ఆదాయానికి భారీ వ్యత్యాసాలు ఉండటంతో పాటు వచ్చిన ఆదాయానికి, చెల్లించిన పన్నులకు కూడా పెద్ద మొత్తంలో వ్యత్యాసం ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. కాగా దిల్ రాజు విచారణ ముగిసిన అనంతరం పుష్ప? నిర్మాతలను సైతం విచారించనున్నట్లు ఐటీ అధికారులు వివరిస్తున్నారు.

Tags

Next Story