TG : కేటీఆర్ లో భయం.. పొలిటికల్ బాంబు పేలబోతోందా?

మంత్రి పొంగులేటి చెప్పినట్టు తెలంగాణలో సంచలనం జరగబోతోందా..కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారా.. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గవర్నర్ ను కలిసిన సీఎం రేవంత్ .. బడా నేత అరెస్టుకు అనుమతి తీసుకున్నారనే టాక్ వస్తోంది. తాజాగా తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టిన కేటీఆర్.. తాను జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో.. ఆయన్ని అరెస్ట్ చేయడానికి రేవంత్ సర్కార్ రంగం సిద్దం చేసిందనే టాక్ వస్తోంది.హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ ఫార్మూలా రేస్‌లో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ నుంచి వివరణ తీసుకుంది ప్రభుత్వం. ఈ కేసులోనే పక్కా ఆధారాలు సేకరించిన ఏసీబీ.. కేటీఆర్ ను ప్రశ్నించేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ విషయం తెలిసే కేటీఆర్ మాట్లాడారని అంటున్నారు. ప్రెస్ మీట్ లో కేటీఆర్ మాట్లాడుతున్నప్పుడు ఆయనలో అరెస్ట్ భయం కనిపించిందనే ఓపినియన్స్ వినిపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com