CM Revanth Reddy : ఫిబ్రవరి 4 సోషల్ జస్టిస్ డే.. రేవంత్ ప్రకటన

తెలంగాణాలో ఫిబ్రవరి 4వ తేదీకి అత్యం త ప్రాధాన్యత ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 2024 ఫిబ్రవరి 4న ఎస్సీ వర్గీకరణ చేయాలన్న నిర్ణయాన్ని మంత్రిమండలి కేబినెట్ ఆమోదించిందని తెలిపారు. శాసనసభ నిరవధిక వాయిదా పడ్డాక తనను కలిసేందుకు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహా దారులతో సీఎం మాట్లాడారు. ఫిబ్రవరి 4నే ఎస్సీ వర్గీకరణ నివేదికను కేబినెట్ ఆమోదించిందన్నారు. దశాబ్దాల జటిలమైన సమస్యకు పరిష్కారం లభించిన ఫిబ్రవరి 4ను తెలంగాణ సామాజిక న్యాయ దినో త్సవంగా జరుపుకుందామని చెప్పారు. త్వరలోనే వర్గీకరణను చట్టం రూపంలో తీసుకువచ్చి శాశ్వత పరిష్కారాన్ని చూపుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వర్గీకరణ పోరాటంలో అసువులు బాసిన వారికి నివాళులు అర్పిస్తున్నానని తెలి పారు. వారి ఆశయాలను ప్రజా ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుందని హామీ ఇచ్చారు. ఇక వర్గీకరణ కోసం ఎవరూ ఎలాంటి ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం లేదని, కులగణన, ఎస్సీ వర్గీకరణలను ఇతర రాష్ట్రాల్లో అమలు చేసేందుకు అవసర మైన సహకారం అందిస్తామని సీఎం వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com