FEO Formula E-Race Case : ఫార్ములా-ఈ రేసు కేసులో ఎఫ్‌ఈవో సంస్థకు నోటీసులు

ఫార్ములా-ఈ రేసు కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. తాజాగా ఎఫ్‌ఈవో కంపెనీకి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఆ సంస్థ సీఈవో స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనుంది. నోటీసులకు స్పందించిన సీఈవో విచారణకు హాజరయ్యేందుకు నాలుగు వారాల సమయం కోరారు. FEO సంస్థకు HMDA రూ.50కోట్లకు పైగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, BLN రెడ్డి, ఐఏఎస్ అరవింద్‌ను ఏసీబీ విచారించింది.
2023 ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో ఈ-ఫార్ములా కారు రేసు జరిగింది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి రూ.55 కోట్ల చెల్లింపులో అక్రమాలు జరిగాయి అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారించేందుకు నెల రోజుల క్రితం గవర్నర్‌ను ప్రభుత్వం అనుమతి కోరిన సంగతి తెలిసిందే.
కేటీఆర్ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్‌ను కోరిన సంగతి తెలిసిందే.అయితే ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏ-1గా కేటీఆర్ ఉండగా....ఏ-2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ-3గా ప్రైవేట్ కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డిలపై కేసులు నమోదు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com