TG : ఐదు ఎమ్మెల్సీలు... కాంగ్రెస్ లో పోటాపోటీ

TG : ఐదు ఎమ్మెల్సీలు... కాంగ్రెస్ లో పోటాపోటీ
X

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడంతో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కించుకునేందుకు నేతలు పోటీ పడుతున్నారు. శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి 65 మంది సభ్యులున్నారు. ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం 3 ఎమ్మెల్సీ సీట్లలో గెలుపు ఖాయం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు సహకరిస్తే మరొక స్థానంలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల టికెట్ వస్తే ఎమ్మెల్సీ కావడం ఖాయమని ధీమాతో ఉన్న నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు అప్పుడే ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ బి మహేష్ కుమార్ గౌడ్ కు దరఖాస్తులు ఇది వరకే అందజేశారు. కొందరు నేతలు ఎఐసీసీ నేతలకు నేరుగా దరఖాస్తులు సమర్పించారు. టీపీసీసీ, ఎఐసీసీకి అందిన దరఖాస్తులను కలిపి ఎఐసీసీ పరిశీలించి అర్హులైన వారికి టికెట్టు ఇవ్వడం పార్టీ సంప్రదాయం. ఎమ్మెల్సీ టికెట్లకై సీనియర్లతో పాటు, జూనియర్ నేతలు కూడా ప్రయత్నాలు ప్రారంభించారు.

మాజీ మంత్రి, టీపీసీసీ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు జి చిన్నారెడ్డి. సిట్టింగ్ ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి. మరో సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్, టీపీసీసీ నేత అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌషిక్ యాదవ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మొగిలి, టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్ సామా రామ్మోహన్ రెడ్డి తదితరులు టికెట్లకై ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నేతలు పెద్ద సంఖ్యలో ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్యేల బలాబలాలను బట్టి నామినేటెడ్ ఎమ్మెల్సీలు కావడంతో ఆశావహులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.

Tags

Next Story