TG : 18న గచ్చిబౌలిలో ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్.. పోస్టర్ ఆవిష్కరించిన సీఎం

TG : 18న గచ్చిబౌలిలో ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్.. పోస్టర్ ఆవిష్కరించిన సీఎం
X

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి FIFA ఫ్రెండ్లీ మ్యాచ్ పోస్టర్ ను ఆవిష్కరించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 18న గచ్చిబౌలి స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగనుంది. భారత్‌, మలేషియా జట్లు తలపడనున్నాయి. పోస్టర్ ఆవిష్కరణలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కీ గౌడ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారత్‌ ఈ మ్యాచ్ లో గెలవాలంటూ శుభాకాంక్షలు తెలిపారు.

Tags

Next Story