Srisailam : సీజన్ లో ఐదోసారి శ్రీశైలం గేట్లు ఓపెన్

Srisailam : సీజన్ లో ఐదోసారి శ్రీశైలం గేట్లు ఓపెన్
X

ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా నదిలోకి వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడు గులకు చేరడంతో శుక్రవారం మధ్యాహ్నం డ్యామ్ ఒక్క గేటును ఎత్తారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీరామదాస్ మోహన్ గేట్ల స్విచ్ ఆన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ ఏడాది డ్యామ్ గేట్లను ఎత్తడం ఇది ఐదోసారి అని అధికారులు తెలిపారు. శనివారం నాటికి నీటి ఉద్ధృతి తగ్గినట్టు అధికారులు తెలిపారు.

Tags

Next Story