CM Revanth Reddy : సర్వహంగులతో ఫిల్మ్ సిటీ.. సోనీ కంపెనీతో సీఎం రేవంత్ ఒప్పందం

తెలంగాణ రాజధాని హైదరాబాద్లో అధునాతన సౌకర్యాలతో కూడిన ప్రపంచస్థాయి ఫిలిం సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. జపాన్ పర్యటనలో భాగంగా గురువారం టోక్యో నగరంలో సోనీ కార్పోరేషన్ ప్రధాన కార్యాలయాన్ని రేవంత్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా సోనీ కంపెనీ ప్రతినిధులతో సీఎం మాట్లాడుతూ, ఎండ్ టు ఎండ్ సామర్ధ్యాన్ని కలిగిన అత్యాధునిక ఫిలిం సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ బృందాన్ని కలిశారు.
సోనీ కార్పొరేషన్ తయారు చేస్తున్న కొత్త ఉత్పత్తులు, చేపడుతున్న నూతన కార్యక్రమాలను కంపెనీ ప్రతినిధులు ఈ సందర్భంగా ప్రదర్శించారు. సోనీ ఉత్పత్తులతో పాటు వాటి పనితీరును ముఖ్యమంత్రి బృందానికి వివరించారు. అనంతరం క్రంచైరోల్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి బృందం చర్చలు జరిపింది. యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్ రంగాలలో పెట్టుబడుల విస్తరణకు హైదరాబాద్ లో ఉన్న అవకాశాలను వివరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com