Fire Accident: రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదం

Fire Accident: రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదం
టింబర్ డిపోలో చెలరేగిన మంటలు; అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోన్న అగ్నిమాపక దళం
హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టింబర్ డిపోలో చెలరేగిన మంటలు ఉధృతంగా మారి డిపో మొత్తం వ్యాపించినట్లు తెలుస్తోంది. హుటాహుటిన రంగంలోకి దిగిన అగ్నిమాపక దళం మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. షార్ట్ సక్యూట్ వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉండవచ్చని పోలీసులు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు. సుమారు 8మంది సిబ్బంది నిర్విరామంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Tags

Next Story