TRS MLA: టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో అగ్ని ప్రమాదం.. భార్యకు గాయాలు..

TRS MLA: జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంట్లో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఎమ్మెల్యే సతీమణి సరోజా స్వల్పంగా గాయపడ్డారు. దీంతో వెంటనే ఆమెను హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని సకినాలు చేస్తున్నారు ఎమ్మెల్యే భార్య, కుటుంబసభ్యులు కలిసి. అంతలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ప్రమాదం సమాచారం అందిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది అప్రమత్తమై అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సరోజకు స్వల్ప గాయాలు మినహా ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కాగా, ఎమ్మెల్యే విద్యాసాగరరావు గత నెలలో అయ్యప్పమాలధారణ స్వీకరించారు. మాలధారణ స్వీకరించడం ఇది ఆయనకు 34వ సారి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com