KPHB Shiva Parvathi Theater: కూకట్‌పల్లి శివపార్వతి థియేటర్‌లో అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన సినిమా హాల్..

KPHB Shiva Parvathi Theater: హైదరాబాద్ KPHBలోని శివపార్వతి థియేటర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సెకండ్ షో ముగిసిన తర్వాత.. సిబ్బంది అంతా వెళ్లిపోయారు. ఈ సమయంలో థియేటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
థియేటర్ లోపలి భాగం మొత్తం మంటల్లో తగులబడిపోయింది. మూడు ఫైరింజన్లతో మంటల్ని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం ఈ థియేటర్‌లో శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. అగ్ని ప్రమాదంతో సుమారు రెండు కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
థియేటర్‌లో సెకండ్ షో సినిమా ప్రదర్శన తర్వాత ప్రేక్షకులు వెళ్లిపోయారు. ఆ తర్వాత థియేటర్ సిబ్బంది కూడా వెళ్లిపోయారు. ఆ తర్వాత తెల్లవారుజామున ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అదే ప్రేక్షకులు ఉన్నప్పుడు మంటలు చెలరేగి ఉంటే.. పెను ప్రమాదం చోటు చేసుకునేది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com