హైదరాబాద్‌ కోఠిలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ కోఠిలో భారీ అగ్నిప్రమాదం
X
మరో ఏడు షాపులకు మంటలు అంటుకున్నాయి.

హైదరాబాద్‌ కోఠిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆంధ్రాబ్యాంక్‌ ఎదురుగా ఉన్న ఓ వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న మరో ఏడు షాపులకు మంటలు అంటుకున్నాయి.ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. నాలుగు ఫైరింజన్లు మంటలు అదుపులోకి తీసుకొచ్చాయి. భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు పోలీసులు, డీఆర్‌ఎఫ్‌ అధికారులు వెల్లడించారు.


Tags

Next Story