Fire Accident : అమీర్‌పేటలో అగ్నిప్రమాదం.. నెయ్యి దుకాణం దగ్ధం..

X
By - Manikanta |28 Aug 2025 2:30 PM IST
హైదరాబాద్ అమీర్‌పేట మెట్రో పిల్లర్ 1444 వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మెట్రో స్టేషన్ సమీపంలోని బాలాజీ నెయ్యి దుకాణంలో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మూడు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో బాలాజీ నెయ్యి దుకాణంతో పాటు పక్కనే ఉన్న ఎంబ్రాయిడరీ షాపు కూడా పూర్తిగా కాలిపోయింది. కాగా ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com