Alert : సాగర్, మూసీల్లో పెరుగుతున్న వరద.. పరీవాహం అలర్ట్

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్, మూసీ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. ఎగువన కురిసిన భారీ వర్షాల వల్ల నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి ప్రస్తుతం 53,532 క్యూసెక్కుల చేరుతుండగా మూసీ ప్రాజెక్టులోకి 542.47 క్యూసెక్కుల చేరుతోంది. సాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా, 509 అడుగులకు చేరుకుంది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ 312.5050 టీ ఎంసీలకు గాను 130.9936 టీఎంసీలకు చేరుకుంది. ప్రస్తుతం సాగర్ జలాశయం నుండి 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులకుగాను ప్రస్తుతం 642.50 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో 4.46 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.82 టీఎంసీల నిల్వ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 831.70 క్యూసెక్కుల వరద నీరు చేరుతంది. రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ ద్వారా 542.47 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.
మరోవైపు.. ఎల్ఎండీ రిజర్వాయర్ కు భారీగా వరద నీరు చేరుతోంది. మధ్య మానేరు, ఎగువ మానేరు నుండి మూడు రోజులుగా ఎల్ఎండీకి చేరుకుంటున్న వరద నీటితో జలకళ ఉట్టి పడుతోంది. ప్రస్తుత నీటిమట్టం డ్యామ్ కెపాసిటీ 920.00 అడుగులు కాగా, 888 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ పూర్తి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.296 టీఎంసీలు ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com