భద్రాద్రి వద్ద వరద గోదావరి.. ఉద్ధృతమైన శబరి నది.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలం వద్ద గోదావరిపై మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బుధవారం సాయంత్రానికి 44 అడుగుల పైగా ఉన్న గోదావరి గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో 45.35 అడుగుల నమోదు అయింది. ఎగువ నుంచి గోదావరి వరద ఉద్ధృతి నిలకడగా ఉండటంతో రెండో ప్రమాద హెచ్చరిక వరకు నీటిమట్టం చేరకపోవచ్చు అని సమాచారం. ఇది ఇలా ఉండగా ఆంధ్ర ప్రాంతంలోని శబరి నది ఉదృతంగా ప్రవహిస్తూ ఉండటంతో భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి తగ్గేందుకు సమయం పట్టవచ్చు.
గురువారం వరుణుడు కొంత శాంతించాడు. భద్రాచల పట్టణంలోని జగదీష్ కాలనీ వద్ద చెరువు గండి పడుతుందన్న సమాచారముతో ఆ కాలనీవాసులు, పట్టణవాసులు ఆందోళన సిపిఎం పార్టీ ఆ ప్రాంతానికి చేరి ధర్నా సైతం ప్రభుత్వ అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించారు తగిన చర్యలు చేపట్టేందుకు సూచనలు సైతం ఇదిలా ఉండగా, జిల్లా యంత్రాంగం మాత్రం ఎటువంటి పరిస్థితులైన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com