Sriramsagar Project : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి.. 16 గేట్లు ఎత్తివేత

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీనితో ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టులోకి వస్తున్న ప్రవాహం దృష్ట్యా అధికారులు మొత్తం 16 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నీటి ప్రవాహం : ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 80,000 క్యూసెక్కులుగా, ఔట్‌ఫ్లో 78,812 క్యూసెక్కులుగా నమోదైంది.
నీటిమట్టం: ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1090.8 అడుగులకు చేరుకుంది. అలాగే, పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 79.65 టీఎంసీలుగా ఉంది.
వివిధ కాలువలకు నీటి విడుదల:
ప్రాజెక్టు నుంచి నీటిని వివిధ కాలువలకు విడుదల చేస్తున్నారు.
కాకతీయ కాలువ: 6,500 క్యూసెక్కులు
ఎస్కేప్ గేట్లు: 1,500 క్యూసెక్కులు
ఇందిరమ్మ వరద కాలువ: 20,000 క్యూసెక్కులు
ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతున్నందున, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com