TG : ఎస్సారెస్పీ, జూరాల ప్రాజెక్టులకు వరద

TG : ఎస్సారెస్పీ, జూరాల ప్రాజెక్టులకు వరద
X

తెలంగాణలో పలు ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఎస్సారెస్పీప్రాజెక్టులోకి 21 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుత నీటిమట్టం 1,065 అడుగులుగా ఉంది. జూరాల ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 20వేలు, ఔట్ ఫ్లో 22,877 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 4.951 టీఎంసీలుగా ఉంది. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం పెరగడంతో నీటి మట్టం 24 అడుగులకు చేరింది. కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తుతున్నది. 1,12,468 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 411 క్యూసెక్కుల అవుట్‌ ఫ్లో నమోదైంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండల పరిధి అంబట్‌పల్లిలో ఉన్న మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్‌కు 53,400 క్యూసెక్యుల వరద వచ్చింది.

Tags

Next Story