TG : ఖమ్మం సింగరేణి ఓపెన్ కాస్ట్‌లోకి వరద.. నిలిచిన బొగ్గు ఉత్పత్తి

TG : ఖమ్మం సింగరేణి ఓపెన్ కాస్ట్‌లోకి వరద.. నిలిచిన బొగ్గు ఉత్పత్తి
X

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపని లేకుండా కురుస్తున్న వర్షంతో సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌గనుల్లో నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వానలతో సత్తుపల్లి పరిధిలోని సింగరేణి జే.వి.ఆర్, కిస్టారం ఓసి ల లోకి నీరు చేరి బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. జే.వీ.ఆర్, కిస్టారం ఓపెన్‌ కాస్ట్‌ గనులలో వర్షపాతం దాదాపు 30 మిల్లీ మీటర్ల వరకూ నమోదయ్యింది. దీంతో లక్షా 35 వేల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకానికి, 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందని తెలుస్తోంది. వర్షాు తగ్గి ఓపెన్‌ కాస్ట్‌ గనులలో చేరిన నీటిని తొలగించిన తరువాతే పనులు ప్రారంభిస్తామంటున్నారు అధికారులు.

Tags

Next Story