Bhadrachalam : భద్రాచలం వద్ద గంటగంటకూ పెరుగుతున్న వరద

Bhadrachalam : భద్రాచలం వద్ద గంటగంటకూ పెరుగుతున్న వరద

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మంగళవారం ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగా సాయంత్రం ఐదు గంటలకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరికి ఎగువ నుంచి వరద నీరు పెరుగుతుండటంతో గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది.

ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. కాగా, భద్రాచలం ఏజెన్సీ నుంచి ఆంధ్రకు వెళ్లే దారిలో గోదావరి రోడ్లపైకి రావడంతో రవాణాకు అంతరాయం కలిగింది. సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో గోదావరి నీటిమట్టం 48.5 అడుగులుగా నమోదయింది.

Tags

Next Story