TG : తెలంగాణలో రాత్రి చలి.. మధ్యాహ్నం ఎండ.. పలుచోట్ల వాన

TG : తెలంగాణలో రాత్రి చలి.. మధ్యాహ్నం ఎండ.. పలుచోట్ల వాన
X

తెలంగాణలో భిన్న వాతావరణం నెలకొని ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో చల్లని గాలులు వీస్తున్నాయి, రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. ఉదయం,సాయంత్రం వేళల్లో చల్లగాలులు వీస్తున్నాయి. ఇక పగటి వేడి విపరీతంగా వేడి వాతావరణం ఉంటుంది. కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 34 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి గాలులు, తీవ్రమైన ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం ఎండగాలులు ఉంటున్నా.. సాయంత్రానికి మాత్రం పూర్తిగా పరిస్థితి మారిపోతుంది. చలికాలం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సాయంత్రం అయిన వెంటనే చలికి తీవ్రత పెరిగి.. కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 18 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణమే ఉంటుంది.

Tags

Next Story