TG : ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 30మంది విద్యార్థినులకు అస్వస్థత

TG : ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 30మంది విద్యార్థినులకు అస్వస్థత
X

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో దీపావళి పండగ పూట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. మండల కేంద్రంలోని హాస్టల్లో గత రాత్రి భోజనానంతరం 30 విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో 27 మంది విద్యార్థులు కోలుకోగా మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. విద్యార్థుల అస్వస్థతకు కలుషిత తాగునీరే కారణమని పలువురు విద్యార్థులు ఆరోపించారు.

Tags

Next Story