Khammam : తిండి లేదు.. సామాన్లు ఖరాబ్.. ఖమ్మంలో వరద బాధితుల కష్టాలు
నాలుగు రోజుల నుంచి కురిసిన వర్షాలతో ఆకేరు, మున్నేరులకు వరద పోటెత్తడంతో ఖమ్మం గ్రామీణ మండలంలోని పలు గ్రామాలు, కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద బీభత్సంతో కరు ణగిరి, రాజీవ్ గృహకల్ప, తీర్థాల, రామన్నపేట, దాన వాయి కన్నా వాల్యాతండా, జలగంనగర్, నాయు డుపేట, పెద్దతండా, కేబీఆర్ నగర్, శ్రీరాంగనర్ లోని ప్రతి ఇల్లు మునిగి పోయింది. పదుల ఇండ్లు నేల మట్ట మయ్యాయి. వందల ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆయా ప్రాంతాలలో ఇండ్లలోని వస్తువులన్నీ పూర్తిగా నీటిపాలయ్యాయి.
ఇళ్లలోకి నీరు చేసి బియ్యం బస్తాలు, పంటల సాగు కోసం తెచ్చి పెట్టుకున్న ఎరువుల బస్తాలు తడిసి ముద్దయ్యాయి. రెండు రోజుల పాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షా లకు మున్నేరుకు వరద నీరు పోటెత్తింది. దీంతో ఆయా పరి వాహక ప్రాంతాల్లో నివసించే పేద ప్రజల ఇండ్లల్లోకి పోటెత్తిన వరదతో ఒక్క రోజులోనే ఇళ్ళంతా ఖాళీ అయ్యింది. కొన్ని ఇండ్లల్లో బురద చేరుకుపోయి అధ్వాన్నంగా ఉన్నాయి. శనివారం రాత్రి వచ్చిన భారీ వరదతో పేద ప్రజలు కట్టుబట్టలతో ఇళ్ళు వదిలి బంధువులు, స్నేహితులు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో తలదాచుకొని ఉన్నారు.
వరద తగ్గిన అనంతరం సోమ, మంగళవారాల్లో వచ్చి చూసుకునే సరికి ఏమీ మిగలకుండా.... అన్నం వండుకునే గిన్నెలు, ఫ్రిజ్లు, చిన్నచిన్న వస్తువులు, పిల్లల పుస్తకాలు, బ్యాగులు అన్నీ కొట్టుకుపోయాయి. కట్టుబట్టలే మిగిలాయని ప్రజలు రోదిస్తున్న తీరు పరామర్శించడానికి వచ్చిన నాయకులను సైతం కంట తడి పెట్టించాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com